Sunday, October 10, 2010

తెలుగులో ఒక మాట

తెలుగు. నా మాతృ బాష. ఎప్పుడో స్కూల్ లో పరీక్షలు కోసం తెలుగులో రాశాను. ఇది జరిగి సుమరుగా పది సంవత్సరాలు అయింది. మళ్ళీ తెలుగు లో రాయటం ఇదే మొదటిసారి. కొంచం కష్టంగా ఉన్న, నా భావాలు నా భాషలో వ్యక్తపరచాలి అని అనుకున్నాను. అందుకోసం తెలుగు లో రాస్తున్నాను. ఏవన్నా తప్పులు ఉంటే క్షమించగలరు.

ఒక తెలుగువాడినై తెలుగులో రాసి పది సంవత్సరాలు గడిచాయి అంటే నా ధూస్థితికి కారణం ఎవరు?. నేనా లేక నా చుట్టూ ప్రపంచమా?. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు ఏనాడో అన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషలోకంటే ఒక స్పష్టమయిన ఉచ్చారణ గల భాషగా తెలుగుకి పేరుగలదు. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుకి ఈ 21st శతభ్ధంలో గడ్డుకాలం ఎదురుకొంటుంది. ఎవరు, ఎక్కడ చూసినా , చిన్న-పెద్ద తేడా లేకుండా ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ముందుకి పోవాలి అంటే ఇంగ్లీష్ ఎంతో అవసరం. అందుకని మన భాషనే మార్చిపోవటం ఎంతవరకు సమంజసం?
ఇటు వంటి కాలం లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు.
ఏది ఏమయినా తెలుగు లో ఒక విషయం గురించి రాయాలని అనుకున్నాను. రాశాను.

ఇక సెలవు
ఇట్లు మీ
వంశీ



Related Posts Plugin for WordPress, Blogger...